కవ్వాలలో విషాదం..

కవ్వాలలో విషాదం..

వడదెబ్బతో వ్యక్తి మృతి

జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల గ్రామానికి చెందిన ఎల్పుల పోశం (57) వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రం తెలిపారు. గత కొంతకాలంగా తీవ్ర ఎండల ప్రభావంతో అస్వస్థతకు గురైన ఆయన మృతి చెందారు. మృతుడికి భార్యతో పాటు పెళ్లయిన ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Leave a Reply