HYD | శేఖర్‌ భాషాపై మరో కేసు..

బిగ్‌ బాస్‌ ఫేమ్‌ శేఖర్‌ బాషాపై నార్సింగ్‌ పోలీసు స్టేషన్‌లో తాజాగా మరో కేసు నమోదు అయింది. మహిళ కొరియోగ్రాఫర్‌ శ్రేష్టి వర్మ ఫిర్యదు మేరకు అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా గతంలో తనపై లైంగిక దాడి చేశాడని శ్రేష్టి వర్మ ప్రముఖ టాలీవుడ్‌ కొరియోగ్రఫర్‌ జానీ మాస్టర్‌పై పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో జానీ మాస్టర్‌ జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అయితే, ఆ కేసులో విచారణ జరుగుతుండగా తన వ్యక్తిగత కాల్‌ రికార్డులు లీక్‌ చేశాడని శేఖర్‌ బాషాపై శ్రేష్టి వర్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పరువుకు భంగం వాటిల్లేలా కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌లో మాట్లాడుతున్నాడని, దురుద్దేశపూర్వకంగానే కాల్‌ రికార్డులు లీక్‌ చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

Leave a Reply