Nagendra Bhog | దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Nagendra Bhog | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వ్యవసాయంలో అద్భుతాలు సృష్టించేందుకు ఆకాశమే హద్దు అని నిరూపిస్తున్నారు కొందరు రైతులు. తాజాగా బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాకు చెందిన రాంకిషోర్ సింగ్ అనే రైతు, ఐదేళ్ల కఠోర శ్రమతో మామిడి సాగులో ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. తన తండ్రి జ్ఞాపకార్థం ఆయన సృష్టించిన ఈ ‘నాగేంద్ర భోగ్’ మామిడి, ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
తండ్రి జ్ఞాపకార్థం..
ఈ కొత్త రకం మామిడికి రైతు రాంకిషోర్ సింగ్ తన తండ్రి జ్ఞాపకార్థం ‘నాగేంద్ర భోగ్’ అని పేరు పెట్టారు. ఇది కేవలం ఒక కొత్త రకం మాత్రమే కాదు, ఒక రైతు తన కుటుంబానికి అర్పించిన ప్రేమాపూర్వక నివాళి. ఈ ప్రత్యేకమైన రకాన్ని అభివృద్ధి చేయడానికి రాంకిషోర్ సింగ్ దాదాపు ఐదేళ్ల పాటు శ్రమించారు. ఈ కాలంలో, అతను నాలుగు వేర్వేరు రకాల మామిడి రకాలను ఎంచుకుని, వాటిని మిళితం చేశారు. ఈ సుదీర్ఘ ప్రక్రియ ఫలితంగానే ‘నాగేంద్ర భోగ్’ ఆవిర్భవించింది.
‘నాగేంద్ర భోగ్’ ప్రత్యేకతలు ఇవే..
- ఈ మామిడి పండు ప్రధాన ఆకర్షణ దాని బరువు. ఒక్కో పండు దాదాపు ఒక కిలోగ్రాము వరకు బరువు ఉంటుంది. ఇది చాలా అరుదైన, వినూత్నమైన లక్షణం.
- ఇంకోటి రుచి. సాధారణ మామిడి పండ్లు కేవలం తీపిగా లేదా పుల్లగా ఉంటాయి. కానీ ‘నాగేంద్ర భోగ్’ మామిడి తీపి, పులుపుల అద్భుతమైన సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. ఈ విభిన్న రుచి మామిడి ప్రియులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది. మూడోది డిమాండ్ . ఈ రకం మామిడి పండ్లు సీజన్ ముగిసే సమయానికి పక్వానికి వస్తాయి. సాధారణ మామిడి పండ్లు మార్కెట్‌లో అందుబాటులో లేని సమయంలో ఇవి రావడం రైతుకు ఒక ప్రధాన లాభదాయక అంశం. రైతు సింగ్ అంచనా ప్రకారం, ఈ నాగేంద్ర భోగ్ మామిడి పండ్లు కేజీకి రూ. 200 వరకు అమ్ముడవుతాయి.
భారీ ఆదయం..
సీజన్ చివరిలో మంచి ధర లభిస్తుండటంతో, ఈ కొత్త రకం మామిడి సాగు రైతులకు భారీ లాభాలను తెచ్చిపెడుతుందని రాంకిషోర్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కేవలం పరిమాణం మరియు బరువు మాత్రమే కాకుండా, రుచిలో కూడా వైవిధ్యాన్ని కలిగి ఉండటంతో మార్కెట్లో దీనికి భారీ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది.
ముజఫర్‌పూర్ రైతు రాంకిషోర్ సింగ్ చేసిన ఈ కృషి, వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తోంది. ‘నాగేంద్ర భోగ్’ మామిడి రూపంలో రైతులకు ఒక కొత్త ఆదాయ వనరు లభించినట్లయింది. ఈ ప్రయోగం మిగతా రైతులకు కూడా ఆదర్శంగా నిలుస్తుంది మరియు వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత , పరిశోధనల ప్రాముఖ్యతను చాటిచెబుతుంది.
