టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్‌కు ఘన నివాళులు..

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్‌కు ఘన నివాళులు..
అమరావతి, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘన నివాళులర్పించారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అలాగే పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు, మంత్రులు, పొలిట్‌బ్యూరో సభ్యులు పాల్గొని ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు.




















