చిట్యాల-ఖజరందొడ్డి బ్రిడ్జి పనులను పరిశీలించిన మంత్రి

మక్తల్, ఆంధ్రప్రభ : పనులను వేగవంతం చేసి బ్రిడ్జిని త్వరలో ప్రజలకు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు.

గురువారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం చిట్యాల వద్ద నూతనంగా చేపడుతున్న చిట్యాల–గజరందొడ్డి గ్రామాల మధ్య రూ.20 కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జి కమ్ బారేజ్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పనుల నిర్మాణ నాణ్యతను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పనుల్లో వేగం పెంచాలని మంత్రి సూచించారు. వర్షాలకు ముందే బ్రిడ్జి కమ్ బారేజ్ నిర్మాణ పనులు పూర్తిచేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని ఆయన ఆదేశించారు. పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా స్పష్టం చేశారు.

వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసేందుకు మరింత వేగం పెంచాలని మంత్రి వాకిటి శ్రీహరి అధికారులు, కాంట్రాక్టర్లను మరోసారి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బి. గణేష్ కుమార్, ఆనంద్ గౌడ్, శివరాంరెడ్డి, నజీర్ పాషా, బీజేపీ నాయకులు చిట్యాల లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ మారుతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply