రాజస్థాన్ విధ్వంసం.. ఎస్ఆర్హెచ్ ముందు కొండంత లక్ష్యం!

రాజస్థాన్ విధ్వంసం.. ఎస్ఆర్హెచ్ ముందు కొండంత లక్ష్యం!
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:
ఎస్ఆర్హెచ్ తో జరుగుతున్న కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్జట్టు భారీ స్కోరు సాధించింది. వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. వైభవ్ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించగా, ధ్రువ్ జురెల్ (50), యశస్వి జైస్వాల్ (29), రియాన్ పరాగ్ (26) రాణించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్ తన 4 ఓవర్లలో ఏకంగా 64 పరుగులు సమర్పించుకొని 16 ఎకానమీతో నిరాశపరచగా, ప్రపుల్ హింగే మూడు వికెట్లు, శివాంగ్, మలింగ మరియు నితీష్ తలా ఒక వికెట్ సాధించారు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ముందు 244 పరుగుల భారీ లక్ష్యం ఉంది. ఈ లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ ఛేదించగలదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
