తెలుగు ప్రజల అతిపెద్ద రాజకీయ పండుగ మహానాడు..

తెలుగు ప్రజల అతిపెద్ద రాజకీయ పండుగ మహానాడు..

వర్చువల్ విధానానికి విశేష స్పందన: గద్దె క్రాంతి కుమార్

పటమట, ఆంధ్రప్రభ : తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానాడు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణాన్ని తలపిస్తోందని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ తెలిపారు.

తూర్పు నియోజకవర్గ పరిధిలోని 1, 3, 4, 5, 6, 7 క్లస్టర్లలో బుధవారం నిర్వహించిన డిజిటల్ మహానాడు కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడుకు కార్యకర్తలు, అభిమానులు, తెలుగు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని అన్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా కార్యకర్తలకు ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అయ్యేలా ఈసారి మహానాడు వర్చువల్ విధానంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ప్రజలకు చేరువయ్యేలా తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 1875 క్లస్టర్లలో ఒకేసారి మహానాడు నిర్వహించడం చారిత్రాత్మక ఘట్టమని ఆయన అన్నారు. ఈ స్థాయి సమన్వయంతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు గుర్తింపు ఇవ్వాలని కోరారు.

తెలుగు జాతి అభ్యున్నతి, రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్తు లక్ష్యంగా మహానాడు వేదికగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను మరింత బలోపేతం చేస్తూ ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగేందుకు మహానాడు దిశానిర్దేశం చేస్తోందని చెప్పారు.

వర్చువల్ మహానాడు పండుగలా కనులపండువగా జరుగుతోందని, టెక్నాలజీని ప్రజాబలానికి అనుసంధానిస్తూ ప్రతి క్షణం కార్యకర్తల భాగస్వామ్యం డ్యాష్‌బోర్డ్‌లో ప్రత్యక్షంగా చూడటం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాల్లో ఆయా క్లస్టర్ల పరిధిలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply