జయంతి వేడుకల్లో సందడి..

జయంతి వేడుకల్లో సందడి..

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను మండల కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు.

మండల పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక పాత సినిమాలు సెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

అలాగే గ్రామంలోని పడమట బజార్, తూర్పు బజార్, హరిజనవాడ, వడ్డెరపల్లెలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి సతీష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేగినాటి గోపాలకృష్ణమూర్తి, మాజీ జెడ్పీటీసీ గజ్జి కృష్ణమూర్తి పాల్గొన్నారు.

పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు సినిమాలు సెంటర్ నుంచి తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

Leave a Reply