గోవు సంరక్షణ హిందూ సంస్కృతికి ప్రతీక
గోవు సంరక్షణ హిందూ సంస్కృతికి ప్రతీక
గోవధ నిషేధానికి సహకరించాలని పాడి రైతుల సంక్షేమ సంఘం, విశ్వహిందూ పరిషత్ నాయకుల పిలుపు
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : గోవు సంరక్షణ హిందూ సంస్కృతికి ప్రతీకగా భావించబడుతుందని, గోవధ నిషేధానికి అందరూ సహకరించాలని పాడి రైతుల సంక్షేమ సంఘం, విశ్వహిందూ పరిషత్ నాయకులు కోరారు.
బక్రీద్ పండుగ సందర్భంగా గోవధ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీస్ అధికారులను కోరారు. గోవులను పూజించిన అనంతరం సంఘ నాయకుడు గణేష్ మచిలీపట్నంలో మాట్లాడుతూ, గతంలో పోలీస్ శాఖ తీసుకున్న కఠిన చర్యల వల్ల గోవధ ఘటనలు గణనీయంగా తగ్గాయని తెలిపారు.
హిందూ సంప్రదాయంలో గోవును దైవస్వరూపంగా భావిస్తారని, గోవు సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇటీవల రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆవులు, గేదెల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ప్రమాదాలకు ప్రధాన కారణం మద్యం సేవించి వాహనాలు నడపడమేనని పేర్కొన్నారు. మద్యం నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మద్యం వినియోగం తగ్గితే రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గే అవకాశముందని అభిప్రాయపడ్డారు.
