స్టెరాయిడ్స్ దుష్ప్రభావంతో తుంటి ఎముక దెబ్బతిన్న రోగికి కొత్త జీవితం

స్టెరాయిడ్స్ దుష్ప్రభావంతో తుంటి ఎముక దెబ్బతిన్న రోగికి కొత్త జీవితం

మేడ్చల్, ఆంధ్రప్రభ:

అధికంగా స్టెరాయిడ్స్ వాడటం వల్ల తుంటి ఎముకలు దెబ్బతిని నడవలేని స్థితికి చేరుకున్న ఓ రోగికి మేడ్చల్‌లోని మెడినోవా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి తిరిగి సాధారణ జీవితాన్ని అందించారు. స్టెరాయిడ్స్ వినియోగంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.

హైదరాబాద్‌కు చెందిన ఉమేష్ సింగ్‌ (44) గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన నడుము, తుంటి నొప్పులతో బాధపడుతున్నారు. కూర్చోవడం, నడవడం, రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను మేడ్చల్‌లోని మెడినోవా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు.

రోగిని పరిశీలించిన హాస్పిటల్ ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ నిపుణులు డా. యు. కార్తిక్ ఆధునిక స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో రెండు హిప్ జాయింట్లలో రక్తప్రసరణ తగ్గిపోవడంతో ఎముక కుళ్లిపోయే ‘అవాస్కులర్ నెక్రోసిస్’ (Avascular Necrosis) సమస్య ఉన్నట్లు నిర్ధారించారు.

పూర్తిగా దెబ్బతిన్న ఎడమ హిప్ జాయింట్‌ను తొలగించి, ప్రత్యేక ఇంప్లాంట్ అమర్చుతూ ‘టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్’ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం ఐసీయూ పర్యవేక్షణలో ప్రత్యేక చికిత్స, ఫిజియోథెరపీ, పోషకాహార సంరక్షణ అందించారు. ప్రస్తుతం రోగి కోలుకుని సాధారణంగా నడుస్తున్నారు.

ఈ సందర్భంగా డా. యు. కార్తిక్ మాట్లాడుతూ, కోవిడ్ సమయంలో అధిక మోతాదులో స్టెరాయిడ్స్ వాడటం వల్లే రోగి తుంటి ఎముకలకు రక్తప్రసరణ ఆగిపోయిందని తెలిపారు. వైద్యుల సలహా లేకుండా స్టెరాయిడ్స్ వాడకూడదని హెచ్చరించారు. జాయింట్ నొప్పులను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే నిపుణులను సంప్రదిస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు.

కార్పొరేట్ స్థాయి ఆధునిక వైద్య సేవలు ఇప్పుడు మేడ్చల్‌లోనే అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

గత రెండు, మూడు సంవత్సరాలుగా తీవ్ర నొప్పులతో ఇబ్బందులు పడుతున్న తమ కుటుంబానికి మెడినోవా హాస్పిటల్ వైద్యులు కొత్త జీవితం ఇచ్చారని రోగి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఆర్థికంగా, శారీరకంగా కుంగిపోయిన సమయంలో వైద్య బృందం అండగా నిలిచిందని కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply