May 27 Cbn Speech : పీకలు కోసినా.. తట్టుకున్నాం Andra Prabha Top News

May 27 Cbn Speech : పీకలు కోసినా.. తట్టుకున్నాం Andra Prabha Top News

  • ప్రజాస్వామ్యం వెనుకే ఉన్నాం
  • కూటమిగా ముందుకు నడుద్దాం
  • టీడీపీ వర్చువల్​ మహా సంబరం
  • టీడీపీ అధినేత సీబీఎన్​ గర్జన

( అమరావతి, ఆంధ్రప్రభ )

May 27 Cbn Speech

వర్చువల్ మహానాడు కారణంగా వాహానాల హోరు తగ్గిందేమో కానీ… కార్యకర్తల్లో జోరు తగ్గలేదని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇంకా ఏమన్నారంటే… అన్ని క్లస్టర్లను అనుసంధానించి మహానాడును నిర్వహించుకుంటున్నాంయుద్దం వల్ల మహానాడును హైబ్రీడ్ పద్దతిలో నిర్వహించుకుంటున్నాం. మీటింగ్ మోడల్ మారిందే తప్ప.. మహానాడు విధానం మారలేదు , అని చంద్రబాబుఅన్నారు.

May 27 Cbn Speech : ఆత్మగౌరవానికి సూచిక

May 27 Cbn Speech

కూడు, గూడు నీడ లాంటి సంక్షేమ విధానాలతో టీడీపీ ఆవిర్భవించింది
విజన్ పాలిటిక్స్ కు రూ పం టీడీపీ, తెలుగు జాతి పుట్టుక జాతీయ జెండా దేశానికి గౌరవం, పసుపు జెండా తెలుగువారి గౌరవం, ఆత్మవిశ్వాసం ప్రతీ ఒక్కరికీ తెలుగుదేశం జెండా చూస్తేనే నమ్మకం, భరోసా అని చంద్రబాబు వివరించారు.

May 27 Cbn Speech : పీకలు కోస్తున్నా… జెండాను వీడలేదు

నాటికి నేటికి తెలుగుదేశం పార్టీపై ప్రజలకు ఆదరణ చెక్కు చెదరలేదు. 45 ఏళ్లుగా ప్రజా సమస్యల కోసం టీడీపీ పోరాటం చేస్తూనే ఉంది. దాడులు, హింస, హత్యా రాజకీయాలు, అక్రమ కేసులు, వేధింపులు వచ్చినా ప్రజా పోరాటాలు ఆపలేదు నరహంతకులు పీకలు కోస్తున్నా.. టీడీపీ కార్యకర్తలు తెలుగు దేశం జెండాను వీడలేదు చంద్రయ్య లాంటి కార్యకర్తను నరుకుతున్నా జై చంద్రబాబు, జై తెలుగుదేశం అంటూ నినదించి అమరుడయ్యారు. ఆయన స్పూర్తి కలకాలం నిలుస్తుంది, అని చంద్రబాబు స్పష్టం చేశారు.

May 27 Cbn Speech : మహిళల వెనుకే టీడీపీ

May 27 Cbn Speech

అక్రమంగా నన్ను జైల్లో పెట్టారు, లోకేష్ యువగళాన్ని అడ్డుకున్నారు. నేతల్ని అరెస్టు చేశారు. బాధితుల్నే నిందితులుగా చేశారు. అయినా టీడీపీ వెనకడుగు వేయలేదు. ప్రజాస్వామ్యం కోసం నిలిచింది ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేస్తున్నాం, అని చంద్రబాబు వివరించారు. ప్రజలు ఆదరించి ఆశీర్వదించి రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత అప్పగించారు. పాలనలో అగ్రెసివ్ గా ప్రోగ్రెసివ్ గా ముందుకు వెళ్తున్నాం. మహిళా సాధికారిత కోసం, సామాజిక, ఆర్ధిక రాజకీయ గౌరవం కోసం పనిచేస్తోంది. ఆస్తి హక్కు నుంచి నేడు తల్లికి వందనం వరకూ అనేక సంక్షేమ కార్యక్రమాలు , స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించటంతో పాటు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు సాధించే వరకూ టీడీపీ మహిళల వెనుక ఉంటుంది. అని చంద్రబాబు స్పష్టం చేశారు.

ALSO READ : Rs-65K-Crores : పేదల సేవలో.. Andhra Prabhya Top Story

Leave a Reply