క్లస్టర్-6లో మహానాడు సందడి

క్లస్టర్-6లో మహానాడు సందడి
కార్యకర్తే అధినేత.. అదే టీడీపీ సిద్ధాంతం
భారీ ఎల్ఈడి తెరలపై మహానాడు ప్రసంగాల వీక్షణ
మంగళగిరి, ఆంద్రప్రభ : మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని క్లస్టర్-6 ఆధ్వర్యంలో ఎన్నారై వై జంక్షన్ సమీపంలోని లిటిల్ విలేజ్ హోటల్‌లో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.
మహానాడు వేదికపై జరుగుతున్న కార్యక్రమాలు, ముఖ్య నాయకుల ప్రసంగాలను వీక్షించేందుకు ప్రత్యేకంగా భారీ ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర నాయకుల ప్రసంగాలను కార్యకర్తలు ఆసక్తిగా వీక్షించారు. కార్యక్రమ ప్రాంగణం మొత్తం పార్టీ జెండాలు, బ్యానర్లతో కళకళలాడింది.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళా సంక్షేమం, రైతుల అభ్యున్నతి వంటి అంశాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజల కోసం పనిచేస్తూ వచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీకే సొంతమని పేర్కొన్నారు.
రాష్ట్ర పురోగతికి మహానాడు వేదికగా తీసుకునే నిర్ణయాలు దోహదపడతాయని, పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు.
మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. మంగళగిరిని అన్ని రంగాల్లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృష్టితో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.
రహదారులు, కాలువలు, తాగునీటి సౌకర్యాలు, విద్యుత్, విద్యా మరియు వైద్య రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా అమలవుతున్నాయని వివరించారు. అలాగే స్మశానాల అభివృద్ధి, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, సీసీ రోడ్లు, డొంక రోడ్ల నిర్మాణం వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటూ ప్రతి గ్రామం, పట్టణ ప్రాంతం సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని నాయకులు తెలిపారు.
“కార్యకర్తే అధినేత” అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతూ ప్రతి కార్యకర్తకు గౌరవం కల్పించే పార్టీగా తెలుగుదేశం పార్టీ కొనసాగుతోందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న గ్రామస్థాయి కార్యకర్తలే టీడీపీకి అసలైన బలమని, వారి సంక్షేమం, రాజకీయ ప్రాధాన్యతకు పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు.
ప్రతి కార్యకర్తను నాయకుడిగా తీర్చిదిద్దడమే పార్టీ లక్ష్యమని, కార్యకర్తలను కుటుంబ సభ్యుల్లా భావించడం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత అని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
