10 లక్షలతో వివో భవన నిర్మాణ0

10 లక్షలతో వివో భవన నిర్మాణ0
జైనూర్, ఆంధ్రప్రభ : కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పట్నాపూర్ పంచాయతీకి మంజూరైన 10 లక్షలతోనూతనంగా నిర్మించే గ్రామైక్య సంఘ భవన నిర్మాణానికి పట్నాపూర్ సర్పంచ్ కందారే లక్ష్మీ బాలాజీ భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ భవన నిర్మాణ పనులు నాణ్యత లోపించకుండా చూడాలని సర్పంచ్ కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మగాడే జ్ఞానేశ్వర్ ససాని గోపాల్, హనుమంత్ పటేల్ హనుమటి ఐకెపి సీసీ రాథోడ్ శ్రీనివాస్,ఉద్యోగులు గ్రామస్తులు పాల్గొన్నారు.
