31 Dead : మళ్లీ ఉద్రిక్తత Andhra Prabha Top News

31 Dead : మళ్లీ ఉద్రిక్తత Andhra Prabha Top News
- అక్కడ చర్చ
- ఇక్కడ రచ్చ
- ఇదీ మధ్యప్రాచ్యం స్థితి
- అమెరికా డ్రోన్ కూల్చివేత
- ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- ఇజ్రాయెల్ భీకర దాడులు
- లెబనాన్ పై 31 మంది మృతి
- యుద్ధ విరమణపై దౌత్యపర ప్రయత్నాలు
- ఖతార్ వేదికగా రాజీ చర్చలు
- శాంతి కోసం చైనా మధ్యవర్తిత్వ ప్రయత్నాలు
( ఆంధ్రప్రభ, టెహ్రాన్ ప్రతినిధి )

యుద్ద విరమణకు దౌత్యపర ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ తమ గగనతలంలోకి ప్రవేశించిందని అమెరికా రీపర్ డ్రోన్‌ను “కూల్చివేశామని” ఇరాన్ ఐఆర్జీసీ ప్రకటించడంతో,,, మళ్లీ పశ్చిమ ఆసియా అంతటా ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. 88 రోజులుగా పూర్తిగా కమ్యూనికేషన్లు నిలిచిపోయిన తర్వాత ఇరాన్ వ్యాప్తంగా పాక్షికంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ తిరిగి రావడం ప్రారంభం కాగా.. తాజాగా.. పరిస్థితి మళ్లీ ఉద్రిక్తతకు దారి తీసింది. ఇక ఇరాన్ పై సైనిక చర్యలు కూడా తీవ్రమయ్యాయి. దక్షిణ ఇరాన్‌లోని క్షిపణి ప్రయోగ స్థావరాలు , మందుపాతరలు అమర్చే నౌకలపై అమెరికా దళాలు దాడులు నిర్వహించాయి. ఈ దాడులను “ఆత్మరక్షణ” చర్యలుగా ఒక సైనిక ప్రతినిధి అభివర్ణించారు.
31 Dead : అటు రాజీ మంత్రాంగం

ఇరాన్‌తో యుద్ధం నిలిపివేతకు ఒప్పందాన్ని కుదుర్చుకునే ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం వైట్ హౌస్‌లో క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన తరుణంలో.. ఈ తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. అంతకుముందు, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ఖతార్‌లోని సంధానకర్తలు ఒక ఒప్పందం కోసం పనిచేస్తున్నారని ఈ ప్రక్రియకు “కొన్ని రోజులు పడుతుందని” సూచించారు.
31 Dead : ఇటు భీకర దాడులు

హిజ్బుల్లాపై దాడులను విస్తరించాలని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదేశించిన తరువాత, లెబనాన్ అంతటా ఇజ్రాయెల్ జరిపిన దాడులలో కనీసం 31 మంది మరణించారు. ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌లోని అనేక గ్రామాలను బలవంతంగా ఖాళీ చేయించాలని ఆదేశాలు కూడా జారీ చేశాయి.
లెబనాన్‌లో తమ కార్యకలాపాలను తీవ్రతరం చేస్తున్నామని, లెబనాన్ భూభాగంలోని తమ ‘భద్రతా మండలాన్ని’ పటిష్టం చేస్తున్నామని నెతన్యాహు అన్నారు.
31 Dead : ప్రతి అడుగూ శాంతి కోసమే

అమెరికా, ఇరాన్‌ల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు తాము కృషి చేస్తున్నట్టు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తెలిపారు. న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉన్నత స్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, “దీర్ఘకాల మనోవేదనలను రాత్రికి రాత్రే పరిష్కరించే పని కాదు, కానీ చర్చలతో ముందుకు వేసే ప్రతి అడుగు శాంతికి ఒక ఆశాకిరణాన్ని అందిస్తుంది,” అని వాంగ్ అన్నారు.
ఇరు పక్షాలు కాల్పుల విరమణకు, శత్రుత్వాలను విరమించుకోవడానికి దృఢంగా కట్టుబడి, ఒకరికొకరు దగ్గరవుతూ, వీలైనంత త్వరగా మధ్యప్రాచ్యానికి శాంతిని తిరిగి తీసుకువస్తారని ఆశిస్తున్నాం,” అని ఆయన అన్నారు.
ఈ వారం ప్రారంభంలో, వాంగ్ బీజింగ్‌లో పాకిస్థాన్ సైన్యాధిపతి, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌ను కలిశారు. ఇరు దేశాల అధికారిక ప్రకటనల ప్రకారం, మధ్యప్రాచ్యంలో శాంతిని పునరుద్ధరించే ప్రయత్నాలపై ఇద్దరూ చర్చించారు, ఇందులో టెహ్రాన్, వాషింగ్టన్ల మధ్య పాకిస్థాన్ కీలక మధ్యవర్తి పాత్ర పోషించింది.
ALSO READ : Hormuz | మళ్లీ వార్ !
