Precautions | ప్రధాని మోడీ సూచన

Precautions | ప్రధాని మోడీ సూచన
బయటకెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించండి
చిన్నారులు, వృద్ధులు, కార్మికులు అప్రమత్తంగా ఉండాలి
ఎక్స్ ద్వారా దేశ ప్రజలకు విజ్ఞప్తి
Precautions | ఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా మండే ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్న నేపధ్యంలో వేడి సంబంధిత అనారోగ్యాల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. ఈమేరకు బుధవారం తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రజలకు ఆరోగ్య సూచనలు చేశారు. దేశంలోని పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎండల కారణంగా సాధారణ జీవనంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తమ మంచినీళ్లు తీసుకెళ్లాలి. శరీరంలో నీటి లోపం రాకుండా తరచూ నీరు తాగుతూ ఉండాలి. మరీముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, కార్మికులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మండే ఎండల నేపథ్యంలో మానవత్వం, పరస్పర సహకారం ఎంతో అవసరం. దాహంతో ఉన్నవారికి సాధ్యమైనంత వరకు ఒక గ్లాసు మంచినీళ్లు అందించాలని కోరారు. ఇళ్లు, దుకాణాలు బయట మంటి కుండలు. పాత్రలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో దాహార్తిని తీర్చుతున్న వారిని ప్రధాని మోడీ ఈ సందర్భంగా కొనియాడారు.

