residences | మనీలాండరింగ్ కేసులో 12ప్రాంతాల్లో తనిఖీలు

residences | మనీలాండరింగ్ కేసులో 12ప్రాంతాల్లో తనిఖీలు

residences |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : కేరళ మాజీ సీఎం పినరయ్ విజయన్ కు చెందిన నివాసాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. తిరువనంతపురంలో ఉన్న ఆయన ఇంటితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒకేసారి తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

మనీలాండరింగ్ కేసుకు సంబంధించి మొత్తం 12 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కన్నూరులోని విజయన్ మరో నివాసంలో కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (సీఎంఆర్‌ఎల్) సంస్థ చుట్టూ ఈ కేసు తిరుగుతోంది.

విజయన్ కుమార్తె టీ వీణాకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ కంపెనీకి సీఎంఆర్‌ఎల్ సంస్థ సుమారు రూ.1.72 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలున్నాయి. 2018-19 మధ్య జరిగిన ఈ లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ఎలాంటి సేవలు అందించకపోయినా భారీ మొత్తంలో చెల్లింపులు జరిగాయని ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీ వీణాను అధికారులు విచారించారు. ఆమె భర్త, ఎమ్మెల్యే మహమ్మద్ రియాస్ నివాసంలో కూడా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే సీఎంఆర్‌ఎల్ సంస్థకు సంబంధించిన పలువురు వ్యక్తుల ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Leave a Reply