owner | భార్య, పిల్లలను చంపి… తండ్రి…

owner | భార్య, పిల్లలను చంపి… తండ్రి…

owner | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : వనపర్తి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఖిల్లాగణపురం మండలం సల్కిలాపురం గ్రామంలో భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసిన కుటుంబ యజమాని అనంతరం తానే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

పోలీసుల వివరాల ప్రకారం.. నరసింహ అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలను సంపులో పడేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. మృతిచెందిన పిల్లలు పదో తరగతి, ఎనిమిదో తరగతి చదువుతున్నట్లు సమాచారం.

పిల్లలను హత్య చేసిన అనంతరం తన భార్యకు ఉరివేసి చంపిన నరసింహ.. తర్వాత చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగి ఉండొచ్చని భావిస్తూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply