ఆవుల అక్రమ తరలింపు

ఆవుల అక్రమ తరలింపు

పాయకాపురం, ఆంధ్రప్రభ:
ఆవులను కబేళాకు తరలించే క్రమంలో వాటిని తాళ్లతో బంధించి, నీరు–మేత లేకుండా మండుటెండలో క్రూరంగా తరలిస్తున్నారని వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో నున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోవిందు రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నున్న బైపాస్ రోడ్డులో ఏపీ 39 డబ్ల్యూ జె 6633 నంబర్ గల వ్యాన్‌లో 11 ఆవులను అక్రమంగా విజయవాడ కబేళాకు తరలిస్తున్నట్లు గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు వాహనాన్ని ఆపి ఆవులను స్వాధీనం చేసుకుని మోపిదేవి గోశాలకు తరలించారు. అనంతరం వ్యాన్ డ్రైవర్లు ఖాదర్, ఇస్మాయిల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. గౌరవ సభ్యులుగా భూషిష్పాక చిరంజీవి (ఆనేపురం) సహా వివిధ గ్రామాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply