పాలీసెట్‌లో రాష్ట్ర ఫస్ట్ ర్యాంక్ .. విద్యార్థినికి ఎమ్మెల్యే సన్మానం

పాలీసెట్‌లో రాష్ట్ర ఫస్ట్ ర్యాంక్ .. విద్యార్థినికి ఎమ్మెల్యే సన్మానం

నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: ఇటీవల విడుదలైన 2026 పాలీసెట్ ఫలితాల్లో స్థానిక సిఎన్ఆర్ పాఠశాల విద్యార్థిని వాన్మైరెడ్డి 120కి 120 మార్కులు సాధించి తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంక్ సాధించింది.

అదే విద్యార్థిని 10వ తరగతి ఫలితాల్లో 600కు 589 మార్కులు సాధించి నాగర్ కర్నూల్ జిల్లా టాపర్‌గా నిలిచింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి విద్యార్థినిని ప్రత్యేకంగా సన్మానించారు. ఆమెను అభినందిస్తూ మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. రాష్ట్ర ఫస్ట్ ర్యాంక్ సాధించి నియోజకవర్గానికి పేరు తీసుకురావడం గర్వకారణమని పేర్కొన్నారు.

ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఈ విద్యార్థినిని ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు భాస్కర్ రావు, చంద్రకళ, ప్రధానోపాధ్యాయురాలు కవిత, యాజమాన్య సభ్యులు సయ్యద్ ఫసియోద్దిన్, వెంకటేశ్వర్ రావు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply