ప్రభుత్వ సికేఎం ఆసుపత్రి అంబులెన్స్ కు లైన్ క్లియర్…

కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్లోని సికేఎం ఆస్పత్రి అంబులెన్స్ వెళ్లడానికి కార్పొరేషన్ అధికారులు లైన్ క్లియర్ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోస్ట్ ఆఫీస్ నుండి సీకేఎం ఆసుపత్రి వరకు రహదారికి అడ్డంకి గా ఉన్న ఇంక్రూచ్ అయినా చిరు వ్యాపారస్తుల రేకుల షెడ్డులను మంగళవారం తొలగించారు. గర్భిణి స్త్రీలు, అనారోగ్యానికి గురైన మహిళలు అంబులెన్స్ లో ఈరహదారి గుండా ఆసుపత్రికి చేరుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని కార్పొరేషన్ అధికారులు రోడ్డుకు అద్దంకిగా మారిన రేకుల షెడ్డులను తొలగించారు.

ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు తలెత్తకుండా ఇంతే జార్ గంజ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శుక్రు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీకేఎం ఆస్పత్రికి అంబులెన్స్ రావాలంటే ఈ రహదారిలోని పలు చిరు వ్యాపారస్తుల దుకాణాలు అడ్డంకిగా మారాయి ఎమర్జెన్సీగా వాహనం సకాలంలో ఆసుపత్రి కి చేరుకోలేకపోవడంతో పలువురు అధికారుల దృష్టికి సమస్యను తీసుకొని రావడం జరిగింది దీంతో రహదారికి అడ్డంకి మారిన రేకుల షెడ్డులను చిరు దుకాణాల సముదాయాలను అధికారులు తొలగించి రహదారి క్లియర్ చేశారు.
