గోహత్యలను అరికట్టాలని పోలీసులకు వినతి

గోహత్యలను అరికట్టాలని పోలీసులకు వినతి
ఊట్కూర్, ఆంధ్రప్రభ:
బక్రీద్ పండుగ సందర్భంగా గోహత్యలను అరికట్టాలని కోరుతూ హిందూవాహిని నారాయణపేట జిల్లా ఊట్కూర్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పోలీసులకు వినతి పత్రం సమర్పించారు. పాడిపశులను కాపాడి గో హత్యలను అరికట్టి గోవుల అక్రమ రవాణా నియంత్రించాలని పేర్కొన్నారు. గోవులను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పోలీసు శాఖ ఆధ్వర్యంలో అక్రమంగా గోవులను తరలించకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని కోరారు. బక్రీద్ పండుగ పురస్కరించుకొని పోలీసులు ప్రత్యేక నిఘఏర్పాటు చేసి గోవులను సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూవాహిని మండల అధ్యక్షులు జేకే అరుణ్, సభ్యులు బాలాంజనేయులు వినోద్, శివ, వంశీ,కావాలి మహేష్, భరత్, బోయిని రవి, బాలు తదితరులు పాల్గొన్నారు.
