ఆర్టీసీ డ్రైవర్ కు అండగా బిఆర్ఎస్

ఆర్టీసీ డ్రైవర్ కు అండగా బిఆర్ఎస్
- అశోక్ సస్పెన్షన్ ఎత్తివేయకపోతే చలో జగిత్యాల
- మాజీమంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, ఆంధ్రప్రభ : రైతులు కష్టించి పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని సూచించిన ఆర్టీసీ డ్రైవర్ను సస్పెండ్ చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్ సస్పెన్షన్ దుర్మార్గం అయిన చర్య అని భారత రాష్ట్ర సమితి అశోక్ కు అండగా ఉంటుందన్నారు. సాయంత్రం లోగా అశోక్ సస్పెన్షన్ ఎత్తివేయకపోతే బుధవారం చలో జగిత్యాల కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. మంగళవారం సాయంత్రం నుండి బిఆర్ఎస్ సోషల్ మీడియా అశోక్ మద్దతుగా నిలవాలన్నారు
సస్పెండ్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్ కు బీఅర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. డ్రైవర్ అశోక్ సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ను కలుస్తామని, డ్రైవర్ సస్పెన్షన్ ఎత్తివేసే వరకు అవసరమైతే అర్.ఏం కార్యాలయం ముందు బైఠాయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, రవీందర్ రావు తో పాటు పలువురు పాల్గొన్నారు.
