వడ్లు కొనాలన్నందుకు ఆర్టీసీ డ్రైవర్ పై వేటు..

జగిత్యాల, ఆంధ్రప్రభ ; పెట్రోల్ డీజిల్ రేట్ల పెంపుపై ఆందోళనలు తర్వాత చేయవచ్చని ముందు వడ్లు కొనమని మంత్రికి చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్ పై వేటు వేశారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల గురించి జగిత్యాలలో ధర్నా చేస్తున్న మంత్రి అడ్లురి లక్ష్మణ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లకు ముందు వడ్లు కొనండని జగిత్యాల డిపోకు చెందిన బస్ డ్రైవర్ సూచించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వడ్లు కొనమని సూచించిన డ్రైవర్ పై వేటు వేసి డ్యూటీకి రావద్దని లెటర్ ను ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జారీ చేశారు.

అయితే తాను ఏ రాజకీయ పార్టీని లేదా నాయకుడిని విమర్శించలేదని, రైతుల గురించి మాత్రమే మాట్లాడానని డ్రైవర్ అశోక్ తెలియజేశారు.ఆర్ఎం నుంచి రిమూవల్ లెటర్ వచ్చిందని, డ్యూటీకి రావద్దని సూచించినట్లు వెల్లడించారు. వడ్లు కొనమని సూచించిన ఆర్టీసీ డ్రైవర్ పై వేటు వేయడం సిగ్గుచేటని పలు రాజకీయ పార్టీల నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నారు.

Leave a Reply