బాసర రైల్వే స్టేషన్‌లో తాగునీటి కొళాయిలు అపరిశుభ్రం..

బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లా పరిధిలోని ఏకైక రైల్వే స్టేషన్ బాసరలో తాగునీటి కొళాయిలు అపరిశుభ్రంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సరస్వతి దేవి క్షేత్రంగా పేరుగాంచిన బాసర రైల్వే స్టేషన్ గుండా ప్రతిరోజు వందలాది మంది హైదరాబాద్, నాందేడ్ వైపు ప్రయాణిస్తుంటారు. గత కొన్ని రోజులుగా స్టేషన్ పరిసరాలు అపరిశుభ్రంగా మారాయని ప్రయాణికులు చెబుతున్నారు.

పారిశుద్ధ్య కాంట్రాక్టు గడువు ముగిసిపోవడంతో శుభ్రత పనులు నిలిచిపోయాయని సమాచారం. దీంతో ప్లాట్‌ఫారమ్‌లపై చెత్త పేరుకుపోయింది. వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో తాగునీటి కోసం కొళాయిల వద్దకు వెళ్లినా నీరు దుర్వాసనతో ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

రైల్వే స్టేషన్‌లో పారిశుద్ధ్య పనులు పునరుద్ధరించి, తాగునీటి సదుపాయాలను శుభ్రంగా నిర్వహించేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Leave a Reply