గవర్నర్ పర్యటనకు ఘన స్వాగతం..

ఉట్నూర్, ఆంధ్రప్రభ: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని ఆదివాసుల పోరాట యోధుడు కొమురం భీమ్ స్వగ్రామమైన రౌటసంకెపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్ల శుక్రవారం పర్యటించారు.
ఈ సందర్భంగా ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరంద గవర్నర్కు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ పాల్గొన్న కార్యక్రమాల్లో ప్రాజెక్టు అధికారి కూడా పాల్గొన్నారు.
రౌటసంకెపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని కొమురం భీమ్ జీవితం, ఆయన చేపట్టిన పోరాటాలు, ఆదివాసుల హక్కుల కోసం చేసిన ఉద్యమాల గురించి తెలుసుకోనున్నారు.
అలాగే ఆదివాసుల ప్రధాన సమస్యలు, వారి జీవన పరిస్థితులు, సంక్షేమ పథకాల అమలు తీరుపై కూడా గవర్నర్ ఆరా తీసే అవకాశం ఉందని ఆదివాసీ నాయకులు తెలిపారు.
