Road accident | 30మందికి గాయాలు

Road accident | 30మందికి గాయాలు
Road accident | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుత్తి మండలం వన్నెదొడ్డి గ్రామం సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సుమారు 30మంది ప్రయాణికులు గాయపడగా, వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి అనంతపురం వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వన్నెదొడ్డి వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న లారీని తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి రహదారిపై పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. పలువురు సీట్లలో ఇరుక్కుపోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని తక్షణమే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారికి ప్రత్యేక వైద్యం అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిర్లక్ష్యమా? లేక సాంకేతిక లోపాల కారణంగానా ప్రమాదం జరిగిందన్న కోణంలో విచారణ కొనసాగుతోంది.
