సీనియర్ ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సహాయం

సీనియర్ ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సహాయం

కేసముద్రం, ఆంధ్రప్రభ: ఇటీవల అకాల మరణం చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ ఇనుముల కరుణాకర్‌కు కేసముద్రం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.

స్థానికంగా నిర్వహించిన సంస్మరణ సభలో ఫోటోగ్రాఫర్ మిత్రులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కరుణాకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం రెండు నిమిషాల మౌనం పాటించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దశాబ్దాలుగా ఎంతోమంది జీవితాల్లోని తీపి జ్ఞాపకాలను తన కెమెరాలో బంధించిన కరుణాకర్ ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కేవలం ఫోటోగ్రాఫర్ మాత్రమే కాకుండా అందరితో కలిసిమెలిసి ఉండే మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు.

కరుణాకర్ లేని లోటు ఫోటోగ్రాఫర్ కుటుంబానికి, అసోసియేషన్‌కు తీరనిదని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి అసోసియేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా కరుణాకర్ కుటుంబానికి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున రూ.25,500 ఆర్థిక సహాయం అందజేశారు.

Leave a Reply