12 bore rifle | భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాల పట్టివేత

12 bore rifle | భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాల పట్టివేత

12 bore rifle | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో భద్రతాబలగాలు మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నాయి. సంయుక్త కూంబింగ్ ఆపరేషన్‌లో ఈ ఆయుధాల నిల్వ బయటపడింది.

కోయిలీబేడా, చోటేబేటియా పోలీస్‌స్టేషన్ల పరిధిలో పోలీసులు, డీఆర్జీ, బీఎస్‌ఎఫ్‌, బీడీఎస్‌ బృందాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా అడవిలో దాచిపెట్టిన మావోయిస్టుల డంప్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

డంప్‌లో కంట్రీమేడ్ బీజీఎల్ లాంచర్లు, 12 బోర్ రైఫిల్, బీజీఎల్ సెల్స్, ఎలక్ట్రిక్‌, నాన్‌ ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, గన్‌పౌడర్‌, సీసా బాంబులు, పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. భద్రతాబలగాల అప్రమత్తతతో మావోయిస్టుల కుట్రను భగ్నం చేసినట్లు వెల్లడించారు.

Leave a Reply