Maharashtra | ఎనిమిది మంది దుర్మరణం

Maharashtra | ఎనిమిది మంది దుర్మరణం

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : మహారాష్ట్ర (Maharashtra) లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయ్‌గఢ్ జిల్లాలోని అంబెనాలి ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో కారులో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

పోలీసుల వివరాల ప్రకారం.. సతారా జిల్లాకు చెందిన ప్రయాణికులు దాపోలి నుంచి తమ స్వగ్రామమైన సతారాకు కారులో వెళ్తున్నారు. పోలాద్‌పూర్-మహాబలేశ్వర్ రహదారిలోని అంబెనాలి ఘాట్ సెక్షన్‌కు చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు రోడ్డు పక్కనున్న సుమారు 1000 అడుగుల లోతైన లోయలోకి దూసుకెళ్లింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదంలో మృతిచెందిన వారిని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply