నేటి నుండి రోహిణి కార్తే ప్రారంభం…..

నేటి నుండి రోహిణి కార్తే ప్రారంభం…..
ఎండలు బాబోయ్ ఎండలు…
జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు..
రోళ్ళు పగిలిపోయే ఎండలు..
నేటి నుంచి జూన్ 8వ తేదీ వరకు..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఎండల తీవ్రత పెరిగిపోయింది. ఉదయం తొమ్మిది గంటలకి ఎండలు మండుతున్నాయి.రోహిణి కార్తె అంటే ఏంటీ..!? ఎండలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి ? రోహిణి కార్తే వచ్చింది అంటే వామ్మో రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగిలే ఎండలు ఉంటాయి అనే నానుడి మనలో మెదలాడుతూ ఉంటుంది.నిజమే మరి ఈ నాలుగు నెలల ఎండాకాలంలో ఎండలు తోలి రోజులలో కొద్ది కొద్దికగా ఉగాది నుండి తాపం పెరుగుతుంది. దిన దిన ప్రవర్దనమానంగా సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని మనకు చూపిస్తాడు.మాములుగా ఉండే ఎండల వేడినే తట్టుకోలేమంటే ఎండాకాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఎండలు దద్దరిల్లుతాయి. మరి ఈ సంవత్సరం రోహిణి కార్తె ఏలా ఉంటుందో నని శాస్త్రవేత్తలు ఇచ్చిన వేస్తున్నారు.
ఎండలు పరీతంగా ఉంటాయి. ఎలినోనా ఉన్న ప్రభావం అధికంగా ఉంటుంది. రోహిణి కార్తే నేటి నుంచి ప్రారంభమై జూన్ 8 వరకు రోహిణి కార్తె ఉంటుంది. రోహిణి కార్తె ఫలితంగా ఈ పక్షం రోజులు అధిక వేడి గాలులు , ఎండ తీవ్రతలు , అగ్ని ప్రమాదాలు అధికంగా ఉంటాయి. ఉక్కపోతలు ఎక్కువగా ఉంటాయి. ఎండ తీవ్రతకు శరీరం అలసిపోతుంది. కావునా ఆరోగ్య రీత్య తగు శ్రద్దలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువ గా మట్టికుండ నీళ్ళు త్రాగడం ,మజ్జిగా , పండ్ల రసాలు , కొబ్బరినీళ్ళు , నిమ్మరసం , రాగి జావ , వంటి విఎక్కువగా త్రాగడం వలన ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుందని డాక్టర్లు సూచిస్తున్నారు. వీటిని సేవించడం వల్ల శరీరం కొంత ఉపశమనం లభిస్తుందన్నారు.మసాలాకు సంబంధించిన ఆహార పదార్ధాలు , వేపుళ్ళు , పచ్చళ్ళు , ఎక్కువ ఆయిల్ ఫుడ్ కలిగిన ఆహార పదార్ధాలు తినకూడదన్నారు. నీటీ సౌకర్యం ఉన్నవారు తప్పకుండా రెండు పూటల స్నానం చేయలన్నారు.అన్నిరకాల వయస్సు వారు ఎక్కువ కాటన్ దుస్తులు వాడండి , తెల్లని రంగు కల్గినవి , తేలిక రంగులు గల కాటన్ బట్టలు ధరిస్తే ఉష్ణ తాపం నుండి ఉపశమనం లభిస్తుంది. శారీరక తాపం తగ్గుతుంది. చిన్నపిల్లలకు మీరు ఉండే ఇంటి ఉష్ణోగ్రత తీవ్రతను బట్టి తడి గుడ్డతో తుడిచి బట్టలు మార్చండి. ఎవరైనా సరే ముదురు రంగు దుస్తులు వేయకపోవడం ఉత్తమంఅన్నారు.ముఖ్యంగా సాటి జీవులైన పశు , పక్ష్యాదులకు త్రాగడానికి మీరు నివసించే చోట వాటికి నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసి వాటికి ప్రాణాలను కాపాడాలని సూచిస్తున్నారు.
బాటసారులు ఎవరైనా సరే వాళ్ళు అడగక పోయిన వాళ్ళ దాహాన్ని తీర్చెందుకు వారికి త్రాగడానికి చల్లటి నీళ్ళను ఏర్పాటు చేయాల న్నారు. ..వర్షాకాలం, శీతాకాలం ఎలాగైనా గడిపేయొచ్చు కానీ ఎండాకాలంలో వేడిని, ఉక్కబోతను తట్టుకోవడం చాలా కష్టం. గత కొన్నేళ్లుగా వేసవి దెబ్బ మామూలుగా ఉండటం లేదు. ఉపరితల ఆవర్తనాల పుణ్యమా అని ఈ ఏడాది మాత్రం వేసవి నుంచి జాగ్రత్తగా గట్టెక్కేశాం. మేలో ఎండలు ఎక్కువగా ఉంటాయి.కానీ ఈ నెలలో సగభాగం వర్షాలతో గడిచిపోయింది. అందరికీ వరుణుడు రిలీఫ్ ఇచ్చినా రైతన్నలకు మాత్రం గోస మిగిల్చాడు. ఋతుపవనాలు వస్తే ఎండలు ప్రభావం తగ్గిపోతుంది అని పలువురు భావిస్తున్నారు.
ఎండాకాలం వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి..
వేసవికాలం నుండి బురదెబ్బను రక్షించుకోవడానికి కనీస జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎక్కువగా నీళ్లు తాగాలి రోజుకు నాలుగు నుంచే ఐదు లీటర్ల నీరు తాగాలి నీరు పళ్ళ రసాలు కొబ్బరినీళ్లు మజ్జిగ ద్రోపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి లేక వర్ణ మూర్తిలికైన కాటన్ దుస్తులు ధరించాలి పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి మితంగా భోజనం చేయాలి ఇంట్లో కిటికీలు తెరిచి ఉంచాలి ఫ్యాన్ వేసి చల్లగా ఉంచుకోండి బయట తిరిగి వచ్చిన వెంటనే కొద్దిసేపు నీడలో కూర్చోవాలి. దీంతో శరీరము చల్లబడటంతో పాటు శరీరంలోని అవయవాలు కూడా కింద పడతాయి ఎండలో తిరిగిన వారు కనీసం ఐదు నుంచి పది నిమిషాల పాటు నీడలో చేదు తీరిన తర్వాత స్వచ్ఛమైన నీరు తాగాలి బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. సూర్యదశమి ఎక్కువగా ఉన్న సమయంలో బయట తిరగకపోవడం మంచిది ఒకవేళ వెళ్లాల్సి వస్తే టోపి ధరించాలి బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా వాటర్ బాటిల్ తీసుకుని వెళ్లాలి రోడ్లమీద లభించే చల్లని రంగుల పానీయాలు తాగరాకు ఎండలు తిరువత ఎక్కువగా ఉన్నందున మాంసాహారం తగ్గించాలి.
నలుపు దుస్తులను ధరించరాదు మందంగా ఉన్న దుస్తులను దూరంగా ఉంచాలి.. వడదెబ్బ తగిలిన వ్యక్తికి త్వరగా నీడ గల ప్రదేశానికి చేర్చాలి చల్లనీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం చదవాలి శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చేవరకు తడిబట్టతో తుడుస్తూ ఉండాలి. ఫ్యాన్ గాలి లేదా చల్లని గాలి తగిలేలా ఉంచాలి ఉప్పు కలిసిన మజ్జిగ కానీ లేదా ఓరల్ రీ ఎడ్యుకేషన్ ద్రావణం కానీ తాగించాలి వడదెబ్బ తగిలిన స్థితిలో ఉన్న రోజుకి నీళ్లు తాగించకూడదు వీలైనంత త్వరగా దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
