వడదెబ్బతో వృద్ధురాలు మృతి..

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని గుంటూరు పల్లకి చెందిన ఎర్రబోయిన జయలక్ష్మి(70) వృద్ధురాలు వడదెబ్బ సోకి ఆదివారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో ఆ కుటుంబంతోపాటు గుంటూరుపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తుల కథనం ప్రకారం గుంటూరుపల్లి కి చెందిన జయలక్ష్మి, వంట గ్యాస్ అయిపోవడంతో, కట్టెల కోసం సమీపంలోని గుట్టల వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన అనంతరం వడదెబ్బతో అస్తవ్యస్థకుగురైనట్లు తెలిపారు. దీంతో స్థానిక వైద్యులను పిలిపించగా, అప్పటికే మృతి చెందినట్లు తెలిపారన్నారు. మృతురాల కి భర్త రాజయ్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చిట్యాల సామాజిక వైద్యశాలకు తరలించారు. వడదెబ్బతో మృతి చెందిన వృద్ధురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ గుంటుపల్లి,నాగమల్లేశ్వరరావు, గ్రామస్తులు కోరారు.

Leave a Reply