మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకత అప్రజాస్వామికం

మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకత అప్రజాస్వామికం

  • గరిడేపల్లి బీజేపీ నేతలు

గరిడేపల్లి, ఆంధ్రప్రభ : దేశ మహిళల గౌరవం, హక్కుల పరిరక్షణ కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించడం అప్రజాస్వామికమని గరిడేపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు కుక్కడపు వెంకటేశ్వర్లు గౌడ్ విమర్శించారు.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీల పిలుపు మేరకు ఆదివారం మండల కేంద్రంలో మహిళా హక్కుల పరిరక్షణ కోసం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం బిల్లును తీసుకువచ్చిందన్నారు.

అయితే రాహుల్ గాంధీ నాయకత్వంలోని ఇండియా కూటమి దీనికి వ్యతిరేకంగా ఓటు వేయడం వారి మహిళా వ్యతిరేక ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు నర్సింగ్ నాగ సైదులు గౌడ్, పగిడి రాధాకృష్ణ, రావుల ఆంజనేయులు, బుడిగ వెంకన్న, కుక్కడపు లక్ష్మయ్య, నర్సింగ్ వినయ్ కుమార్, మండల సత్యం, మోదాల గంగాధర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళల అభివృద్ధికి అడ్డుపడుతున్న ప్రతిపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు.

Leave a Reply