జీవనోపాధికి అండగా బొండా ఉమా..

జీవనోపాధికి అండగా బొండా ఉమా..
టిఫిన్ బండి, నగదు సహాయం అందజేత
సొంత నిధులతో టిఫిన్ బండి అందజేస్తున్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.
పాయకాపురం, మే 23 (ఆంధ్రప్రభ): ప్రజా సేవతోనే తనకు నిజమైన సంతృప్తి లభిస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఓ నిరుపేద మహిళకు జీవనోపాధి కోసం టిఫిన్ బండి అందజేశారు.
జీవనోపాధి నిమిత్తం టిఫిన్ బండి కావాలని ఆ మహిళ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన బొండా ఉమా తన సొంత నిధులతో టిఫిన్ బండిని అందజేశారు. అంతేకాకుండా ప్రారంభ పెట్టుబడి కోసం రూ.5 వేల నగదు సహాయాన్ని కూడా అందించారు. టీడీపీ శ్రేణుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏపీ బోక్వా చైర్మన్ గొట్టుముక్కల రఘు, కార్యాలయ ఇన్చార్జి ఘంటా కృష్ణమోహన్, విజయకృష్ణ సూపర్ బజార్ చైర్మన్ వెలగపూడి సురేష్, డైరెక్టర్లు మోతుకూరి ఖాసిం, మాచెర్ల గోపీనాథ్, బుదాల సురేష్, కంచేటి నాగరాజు, సీహెచ్ రఘు, డీడీ నాయుడు, లక్కీశెట్టి సాయి, పాలగాని శివ తదితరులు పాల్గొన్నారు.
