నిత్యం అందుబాటులో ఉన్న ఉచిత శుద్ధివాటర్ ప్లాంట్

నిత్యం అందుబాటులో ఉన్న ఉచిత శుద్ధివాటర్ ప్లాంట్

చల్లని తల్లి కళ్ళే లలిత..
365రోజులు ప్రజలకు ఉచిత శుద్ధి వాటర్ ప్లాంట్.

పాయకాపురం, ఆంధ్రప్రభ : ప్రజలకు 365రోజుల పాటు నిత్యం శుద్ధి మంచినీటిని అందిస్తున్న స్వర్గీయ కళ్ళే లలిత వాటర్ ప్లాంట్ ప్రజల మన్నలను పొందుతున్నది. సింగ్ నగర్ ప్రాంతంలో కళ్ళే లలిత వీధిలో స్వర్గీయ కళ్ళే లలిత విగ్రహం వద్ద పాదాచారులకు,వాహన చోదకుల దాహార్తిని తీర్చడానికి కళ్ళే లలిత ట్రస్ట్ అధ్యక్షుడు కె. నాగేశ్వరరావు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. అన్నీ రుతు క్రమాల్లో ఈ వాటర్ ప్లాంట్ ప్రజలకు అందుబాటులో ఉంటున్నది.

రైతు బజార్లకు వచ్చే కొనుగోలుదారులు,పారిశుధ్య కార్మికులు,ఆసుపత్రికి వచ్చే రోగులకు, నార్త్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలు, విద్యార్థులు,ఆటో, వాహన చోదకులకు నిత్యము ఇక్కడ ఆగి మంచినీటి బాటిళ్లతో నీటిని పట్టుకొని దాహార్తికి తీర్చుకొంటున్నారు. వేసవిలో చల్లని నీటిని కూడా నిర్వాహకులు అందుబాటులో ఉంచుతున్నారు. అందుకే అక్కడి ప్రజలు దాహార్తిని తీర్చే చల్లని తల్లి కళ్ళే లలిత అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Leave a Reply