పాలీసెట్లో స్టేట్ ర్యాంకు సాధించిన విజ్ డమ్ హై స్కూల్ విద్యార్థి

పాలీసెట్లో స్టేట్ ర్యాంకు సాధించిన విజ్ డమ్ హై స్కూల్ విద్యార్థి
నర్సంపేట, ఆంధ్రప్రభ : పాలీసెట్ 2026 ప్రవేశ పరీక్షల్లో విజ్ డమ్ హై స్కూల్ కు చెందిన షేక్ ఫర్మాన్ షా రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకును సాధించి నట్లు పాఠశాల డైరెక్టర్ జావెద్ తెలిపారు. ఈ విద్యార్థి 120 మార్కులకు గాను 119 మార్కులు సాధించినట్లూ తెలిపారు. ఉత్తమ ప్రతిభను కనబరి చిన ఫర్మాన్ షా మాట్లాడు తూ కంప్యూటర్ ఇంజనీరింగ్ లో రాణించి భవిష్యత్తులో ఐఏఎస్ కావడం తన లక్ష్యమని తెలిపాడు. తన విజయా నికి నిరంతరం కృషి చేసిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, ప్రోత్సహించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
షేక్ అర్మాన్ షా స్టేట్ 48వ ర్యాంకు, గౌతమ్ స్టేట్ 350 వ ర్యాంకు సాధించగా, 2000 ర్యాంకు లోపు 12 మంది విద్యార్థులు సాధించినట్లు డైరెక్టర్ జావెద్ తెలిపారు. ఉత్తమ ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయిలో రాణించిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ జహంగీర్, డైరెక్టర్ జావేద్, అకాడమిక్ అడ్వైజర్ నాజియ ఇక్బాల్, వైస్ ప్రిన్సిపాల్ ప్రకాష్, ప్రీ స్కూల్ ప్రిన్సిపాల్ ఫహీం సుల్తానా, హై స్కూల్ ఇన్చార్జి హారిక, వీరభద్రయ్య, రాము, ఇలియాస్, శివరాజ్, సతీష్ కుమార్, రఘుపతి రెడ్డి, బి రవీందర్, వెంకటేశ్వర్లు, నవీన్, ఎల్ రవీందర్ లతో పాటు ఉపాధ్యాయులు, అభినందించారు.
