చిన్నారులే భారత దేశపు భారీ పౌరులు..

కరీమాబాద్, ఆంధ్రప్రభ : నేటి చిన్నారులే రేపటి భారతదేశ భవిష్యత్ పౌరులని కాంగ్రెస్ నాయకులు ముష్కమల్ల సుధాకర్, కోడం శివకృష్ణ, శ్రీధర్ పేర్కొన్నారు. ఆదివారం 33వ డివిజన్ పరిధిలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో వారు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించే కార్యక్రమాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఎదగాలంటే పోలియో నివారణ అత్యంత ముఖ్యమని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.

పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన వారు, ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో వైద్య సిబ్బంది చేస్తున్న సేవలను అభినందించారు. ఆరోగ్య కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఆరోగ్య శాఖ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.