మంత్రి గారు.. జొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టండి…

మంత్రి గారు.. జొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టండి…

మంత్రి కి వినతిపత్రం..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో గత నాలుగు రోజుల క్రితం నుండి జొన్న రైతులు పడుతున్న కష్టానికి, సమస్యకు పరిష్కారం కొరకై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సివిల్ సప్లై, మార్క్ ఫెడ్ సంస్థ ల ద్వారా అదనంగా జొన్నలను కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్, జిల్లా కార్యదర్శి రామచంద్రుడు, సురేష్, శ్రీనివాసరెడ్డి వివిధ మండలాల జొన్న రైతులు రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ కి వినతి పత్రం ఇచ్చరు. జిల్లాలో 54 వేల ఎకరాల్లో జొన్న సాగు అయినదన్నారు.

లక్ష మెట్రిక్ టన్నులకు పైగా పంట దిగుబడి వచ్చిందన్నారు.ప్రభుత్వం వారు మద్దతు ధరకు కొనుగోలు చేయటానికి నంద్యాల జిల్లాకు కేవలం 28500 మెట్రిక్ టన్నులు జొన్నలు మాత్రమే కొనుగోలు చేయటానికి అన్ని అనుమతి ఇచ్చారన్నారు. దీంతో జిల్లాలోని గడివేముల, వెలుగోడు, గోస్పాడు మండలాల తో పాటు వివిధ మండలాల్లో జొన్న రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని ఫిర్యాదు చేశారు., ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్దకు ట్రాక్టర్లు, లారీలలో జొన్నల్ని తీసుకొని వచ్చి గత మూడు రోజుల క్రితం నుండి నంద్యాల సెంట్రల్ వేరౌస్ దగ్గర నిరీక్షిస్తున్నారన్నారు. సంబంధిత అధికారులు మాత్రం ప్రభుత్వం నుండి అనుమతి వచ్చే వరకు కొనేది లేదని చెప్పటం వల్ల రైతుల్లో తీవ్రమైన ఆందోళన నెలకొన్నదన్నారు.

గత్యంతరం లేకనే రోడ్లపైకి వచ్చి ఆందోళనలో చేస్తున్నారన్నారు. మంత్రి వెంటనే జోక్యం చేసుకొని జిల్లాలో ఉన్న మొత్తం జొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయించే విధంగా చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు.అనుమతి లేదని పేరుతో, ట్రక్ సీట్ లేవని పేరుతో రైతుల్ని వెనక్కి తిప్పి పంపితే జొన్నలు తెచ్చిన వెహికల్స్ బాడుగలు చెల్లించలేక, పండించిన పంటకు సరిపడా పెట్టుబడి కూడా రాక మధ్య దళారులకు అమ్ముకొని తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. జిల్లాకు అదనపు కొనుగోలు కు అనుమతి ఇవ్వాలని కోరారు.

అందుకు సానుకూలంగా మంత్రి స్పందించి వెంటనే జిల్లా పౌర సరఫరాల సరఫరాల శాఖ, మార్క్ఫెడ్ అధికారులు, పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. జొన్న రైతుల కొనుగోలుకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నుండి చర్యలు తీసుకుంటామని మంత్రి రైతులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దామోదర్ రెడ్డి రాంపల్లి రఘునాథరెడ్డి నాగభూషణ్ రెడ్డి తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Leave a Reply