వడదెబ్బతో పొలంలోనే రైతు మృతి

వడదెబ్బతో పొలంలోనే రైతు మృతి

మంగపేట, ఆంధ్రప్రభ : వడ దెబ్బతో పొలంలోనే ఊటుకూరి సోమిరెడ్డి ( 78 ) అనే రైతు మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలం పూరేడుపల్లి గ్రామంలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మంగపేట మండలం రామచంద్రునిపేట ( సంఘంపల్లి ) గ్రామానికి చెందిన ఊటుకూరి సోమిరెడ్డికి మండలంలోని పూరేడుపల్లి గ్రామంలో పొలం ( వ్యవసాయ భూమి) ఉంది. సోమిరెడ్డి శుక్రవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో రామచంద్రునిపేటలోని తన ఇంటి వద్ద నుండి పూరేడుపల్లి గ్రామంలోని తన పొలం వద్దకు వెళ్లి శుక్రవారం రాత్రి ఇంటికి రాలేదు.

కాగా ఊటుకూరి సోమిరెడ్డి మృతదేహం అతని పొలంలోనే శనివారం ఉదయం స్థానికులకు కనిపించడంతో స్థానికులు సోమిరెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మృతుడి కుమారుడు రవీందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగపేట మంగపేట ఎస్సై టి.వి.ఆర్.సూరి తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహింఛి కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం సంఘటన స్థలంలోనే మృతదేహానికి వైద్య సిబ్బంది పోస్టుమార్టం నిర్వహించారు.

Leave a Reply