జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్న క్యాతన్‌పల్లి చైర్‌పర్సన్
క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : జిల్లా కేంద్రం, అక్టోబర్ 22 ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ గోడిసెల సంధ్యారాణి పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, డిప్యూటీ మేయర్, బెల్లంపల్లి, చెన్నూర్ చైర్‌పర్సన్లు పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు.రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు,మహాలక్ష్మి, గృహ జ్యోతి, చేయూత, ఆరోగ్య శ్రీ, రేషన్ కార్డులు, పెళ్లి కానుక, పింఛన్లు, ఉచిత బియ్యం తదితర పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ఈసందర్భంగాచైర్‌పర్సన్.సంధ్యారాణిమాట్లాడుతూ ప్రజల సమస్యలను తక్షణమే గుర్తించి పరిష్కరించేందుకు మున్సిపాలిటీ కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ లక్ష్యం ప్రజా సంక్షేమమేనని, పట్టణఅభివృద్ధికిప్రాధాన్యతఇస్తున్నామనితెలిపారు.కార్యక్రమంలో క్యాతన్‌పల్లి వైస్ చైర్‌పర్సన్ మిట్టపల్లి సరిత, కౌన్సిలర్లు మద్దెల శంకర్, జంజూపల్లి శశికుమార్, వేనంక శ్రీనివాస్, కృపానందం, బబ్బర స్వర్ణలత, గుర్రం శ్రీనివాస్, రంగా లక్ష్మి, పల్లా శ్రీదేవి, ధమక శిరీష, మంతెన మల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు.
