ధాన్యం కొనకుంటే కలెక్టరేట్ ముట్టడిస్తాం

ధాన్యం కొనకుంటే కలెక్టరేట్ ముట్టడిస్తాం

  • బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
  • చాకెపల్లి, బుచ్చయ్యపల్లిలో వరి కొనుగోలు కేంద్రాల పరిశీలన

బెల్లంపల్లి, (ఆంధ్రప్రభ):
యాసంగి వరి ధాన్యం కల్లాల్లోకి వచ్చి వారాలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం దుర్మార్గమని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మండిపడ్డారు. శుక్రవారం బెల్లంపల్లి మండల పరిధిలోని చాకెపల్లి, బుచ్చయ్యపల్లి గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి, రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ.. బెల్లంపల్లి నియోజకవర్గ రైతుల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు వెలుపలి పర్యటనలకు, పార్టీలకు ఉన్న సమయం.. నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి, రైతుల సమస్యల పరిష్కారానికి లేకపోవడం సిగ్గుచేటన్నారు. కల్లాల్లో సిద్ధంగా ఉన్న వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి గింజనూ తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నియోజకవర్గ రైతులతో కలిసి మంచిర్యాల కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ తొగరి సత్యనారాయణ, బెల్లంపల్లి మాజీ ఎంపీపీ గొల్లపల్లి సుభాష్ రావు, బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు బొడ్డు గణేష్ గౌడ్, మండల బీఆర్ఎస్వై మాజీ అధ్యక్షుడు ఎలిగేటి మహేందర్, నాయకులు మల్లేష్, సంతోష్, రమేష్, రాజేష్ మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

Leave a Reply