రైతులు అధైర్య పడవద్దు..

రైతులు అధైర్య పడవద్దు..
- పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తాం
- మంత్రి అడ్లూరి లక్ష్మణ్
గొల్లపల్లి, ఆంధ్రప్రభ ; వరి మొక్కజొన్న పండించిన రైతులు ఆందోళన చెందవద్దని జిల్లాలో రైతులు పండించిన ధాన్య పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం తిరుమలపూర్ గ్రామంలోని ధాన్యము కొనుగోలు కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన ట్రాన్స్ ఫార్మర్, బోరు బావిని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో ఈ రబీ సీజన్ లో పెద్ద మొత్తంలో వరి, మొక్కజొన్న దిగుబడులు వచ్చాయన్నారు.
రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని, జిల్లాలో పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఇప్పటికే జిల్లాలో 2.61లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, మిగిలిన ధాన్యం కొనుగోలు చేయడానికి నిత్యం అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ఎక్కడ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వంలో పనిచేస్తున్న తాము సమస్యలను చూసి పారిపోయే పరిస్థితి లేదని, సమస్య పరిష్కారం అయ్యే వరకు ముందుకు సాగుతున్నామన్నారు.
