project | డీపీఆర్ వచ్చిన తర్వాత తుది నిర్ణయమన్న ఖట్టర్

project | డీపీఆర్ వచ్చిన తర్వాత తుది నిర్ణయమన్న ఖట్టర్

project | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో కీలకమైన మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ ఖట్టర్ తో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సమావేశమైన సందర్భంగా ఈ అంశంపై కీలక చర్చ జరిగింది.

హైదరాబాద్ మెట్రో రెండో దశలో 162 కిలోమీటర్ల మేర విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్లు ఖట్టర్ తెలిపారు. డీపీఆర్ అందిన తర్వాత పూర్తి స్థాయిలో పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చెరో సగం వ్యయంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

ఢిల్లీలో జరిగిన సమావేశంలో హైదరాబాద్‌లో కొనసాగుతున్న మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, ప్రజారవాణా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. మెట్రో సెకండ్ ఫేజ్ ప్రాజెక్టుకు కేంద్రం సానుకూలంగా స్పందించడం నగరాభివృద్ధికి కీలక ముందడుగుగా భావిస్తున్నారు. కాగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఎల్ అండ్ టీ సంస్థ నుంచి తొలి దశ మెట్రో ప్రాజెక్టును టేకోవర్ చేసిన విషయం తెలిసిందే.