మైనర్ బాలికపై ఆత్యాచారం
మైనర్ బాలికపై ఆత్యాచారం
- తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
మోపిదేవి, ఆంధ్రప్రభ : మైనర్ బాలికపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన మోపిదేవి పంచాయతీ శివారు బోడగుంట గ్రామంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు బోడగుంట గ్రామానికి చెందిన 14 సంవత్సరాల మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన మోటుపల్లి చింతయ్య (55) ఆత్యాచారం చేసి గర్భవతిని చేసినట్లు బాలిక తల్లి మోపిదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ ఆదేశాల మేరకు అవనిగడ్డ డిఎస్పీ ఆర్.అభిషేక్ దర్యాప్తు చేయటం జరిగింది. దర్యాప్తులో భాగంగా బాలికను పదే పదే అత్యాచారం చేసి గర్భవతిని చేసినట్లు తేలింది.
బోడగుంట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనుమతులు లేకుండా క్లినిక్ నిర్వహిస్తుండగా, అతని సహాయంతో ముద్దాయి గర్భాన్ని తొలగించేందుకు అబార్షన్ నిమిత్తం మందులు వాడినట్లు తేలింది. అత్యాచారం చేసిన నిందితుడితోపాటు క్లీనిక్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నట్లు చల్లపల్లి సీఐ ఈశ్వరరావు, మోపిదేవి ఎస్ఐ పి.గౌతమ్ కుమార్ లు తెలిపారు. మైనర్ బాలికపై అత్యాచారం ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే దర్యాప్తు నిర్వహించి ముద్దాలు లను అరెస్టు చేయటం జరిగిందని సీఐ తెలిపారు. రిమాండ్ నిమిత్తం ముద్దాయిలను కోర్టుకు హాజరుపర్చనున్నట్లు తెలిపారు.
