జన గణనలో భాగస్వాములు కావాలి

జన గణనలో భాగస్వాములు కావాలి

జన గణనను తనిఖీ చేసిన కలెక్టర్ సాయి కాంత్ వర్మ

గుంటూరు, ఆంధ్రప్రభ : జనాభా గణనలో ప్రజలు భాగస్వామ్యం కావాలని జిల్లా ప్రిన్సిపాల్ సెన్సస్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ పిలుపునిచ్చారు. గుంటూరు మండలం బుడంపాడులో జన గణనను జిల్లా కలెక్టర్ మంగళ వారం తనిఖీ చేశారు. క్షేత్ర స్థాయిలో చేపడుతున్న ప్రక్రియ, వేగవంతం చేయుటకు అవకాశాలు పరిశీలించారు. ఇళ్ళ వద్ద ఆయా యజమానులతో స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యుమరేటర్లు మే 1వ తేదీన తమకు కేటాయించిన ఇళ్లను తమ ఎన్యూమరేషన్ కి సంబంధించి హద్దులు సరి చూసుకుని మే 30వ తేదీ వరకు ప్రతి ఇంటిని సందర్శించి, మ్యాప్ ఆధారంగా సరిహద్దులను గుర్తించి వారి మొబైల్ యాప్‌లో వివరాలను నమోదు చేస్తారని చెప్పారు. ప్రజలు ఇచ్చే వ్యక్తిగత సమాచారం చాలా సురక్షితంగా ఉంటుందన్నారు.

సరైన సమాచారం ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన తదితర ప్రణాళికలు రూపొందించడానికి వీలవుతుందన్నారు. జనాభా గణనలో వివరాలు ఇవ్వడం వల్ల ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు కోల్పోవడం జరగదని, ప్రజలందరూ ధైర్యంగా, ఖచ్చితమైన సమాచారాన్ని ఎన్యుమరేటర్లకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్  కె.మయూర్ అశోక్, తహసీల్దార్ సుభాని, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply