అప్రైజర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీరాముల గంగాధర్

అప్రైజర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీరాముల గంగాధర్

జన్నారం, ఆంధ్రప్రభ:
తెలంగాణ రాష్ట్ర డీసీసీ సహకార బ్యాంకు అప్రైజర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ గ్రామానికి చెందిన శ్రీరాములు గంగాధర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్ బ్యాంకు అప్రైజర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, రాష్ట్ర సెక్రటరీ రాఘవచారిలు ఆయనను నూతన అధ్యక్షుడిగా ఎంపిక చేశారు.

ఈ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కామారెడ్డికి చెందిన శివకుమార్, రాష్ట్ర కోశాధికారిగా నిజామాబాద్‌కు చెందిన ప్రభాకర్, అలాగే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రంగారెడ్డి జిల్లాకు చెందిన కృష్ణామాచారి, ఆంజనేయులను నియమించారు. హైదరాబాద్‌లోని కోఠిలో గల బీసీ సాధికారిక సంస్థ (బీసీ భవన్)లో జరిగిన ఒక ప్రత్యేక సమావేశంలో.. అఖిల భారత విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె. జగనాథం సుమారు 250 మంది సభ్యుల సమక్షంలో శ్రీరాముల గంగాధర్కు నియామక పత్రాన్ని అందజేసి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీరాముల గంగాధర్‌కు సోమవారం సాయంత్రం ఆ సంఘం నేతలు శ్రీరాముల వెంకటేష్, ప్రశాంత్ తదితరులు కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, అప్రైజర్ల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని స్పష్టం చేశారు.