కొనుగోలు కేంద్రం కూలీకి ఆర్థిక సహాయం అందజేత

కొనుగోలు కేంద్రం కూలీకి ఆర్థిక సహాయం అందజేత

మానవత్వం చాటుకున్న దేవున్ పల్లి గ్రామస్తులు,
మిఖిలేష్‌ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేస్తున్న గ్రామస్తులు,

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్‌ మండలంలోని దేవన్‌పల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద జరిగిన ప్రమాదంలో చేయి వేలు విరిగిన బిహార్‌ కూలీ మిఖిలేష్‌ కు సర్పంచ్, గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక చేయూత అందించారు.గాయపడిన మిఖిలేష్‌కు ఆర్థిక సహాయం అందజేయడానికి గ్రామస్తులు తమకు తోచినంత నగదును జమచేశారు.

జమచేయగా వచ్చిన రూ. 40 వేలను సర్పంచ్‌ లకావత్‌ శేఖర్, వీడీసీ అధ్యక్షుడు రాములు సమక్షంలో బాధిత కూలీ కుటుంబ సభ్యులకు ఆదివారం అందజేశారు. ఉప సర్పంచ్‌ బొడ్డు సాయిలు, గంగాధర్, రాజు గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply