ఆదర్శనగర్‌ కాలనీలో వర్షపు నీటితో ఇబ్బందులు

ఆదర్శనగర్‌ కాలనీలో వర్షపు నీటితో ఇబ్బందులు

… ఎమ్మెల్యే వంశీకృష్ణకు కాలనీవాసుల వినతి

అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ, శ్రీ చైతన్య స్కూల్ వెనుక భాగంలో వర్షపు నీరు నిలిచిపోవడంతో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణకు కాలనీవాసులు ఆదివారం వినతిపత్రం అందజేశారు. కాలనీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో కొద్దిపాటి వర్షానికే మట్టి రోడ్లు బురదమయంగా మారుతున్నాయని వారు తెలిపారు.

దీంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దోమల వ్యాప్తితో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, దుర్వాసనతో ఇబ్బందులు అధికమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై గతంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కోరినట్లు తెలిపారు. వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ సానుకూలంగా స్పందిస్తూ మున్సిపల్ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి త్వరలోనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Leave a Reply