కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలి

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలి

మరిపెడ, ఆంధ్రప్రభ : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి ప్రజలపై పెను భారాన్ని మోపింది పెట్రోల్, డీజిల్ పై మూడు రూపాయలు వంటగ్యాస్ వాణిజ్య గ్యాస్ సిలిండర్ లపై వంద రూపాయలు తెచ్చి దేశ ప్రజల పైన, వాహనదారుల పైన పెను భారాన్ని మోపడం బీజేపీ నియంతృత్వ పాలనకు నిదర్శనం అని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఐ మరిపెడ మండల సమితి ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్, పట్టణ కార్యదర్శి మల్లెపాక యాకన్న, అంజి, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply