రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం..

కడెం, ఆంధ్రప్రభ : రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ పడిగెల భూషణ్ అన్నారు. ఆదివారం కడెం మండలంలోని ఎలగడప గ్రామంలో పాండవపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పడిగెల భూషణ్, పాండవపూర్ పీఏసీఎస్ చైర్మన్ రామడుగు శైలజ-రమేష్ కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకుని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించాలని రైతులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న, ఆర్టీఏ మెంబర్ తుమ్మల మల్లేష్ యాదవ్, గ్రామ సర్పంచ్ నర్సింగ్, అశ్విత రమేష్, పీఏసీఎస్ డైరెక్టర్లు భూమరాజం, రాజేశ్వర్ రెడ్డి, మల్లేష్, భూమన్న, రాజన్న, పీఏసీఎస్ సీఈఓ ఆశన్న, ఉపసర్పంచ్ రాపర్తి శ్రీనివాస్, జీపీ వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సలీమ్, రైతులు పాల్గొన్నారు.
