బండి భగీరత్ కు 14 రోజుల రిమాండ్

బండి భగీరత్ కు 14 రోజుల రిమాండ్

చర్లపల్లి జైలుకు తరలింపు

హైదరాబాద్ ఆంధ్రప్రభ : ఫోక్సో కేసులో నిందితుడు బండి భగీరత్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ మేడ్చల్ న్యామూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయమూర్తి రిమాండ్  విధించిన నేపద్యం లో పోలీసులు బండి భగీరథ్ ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈనెల 8వ తేదీన బండి భగీరథ పై ఫోక్సో కేసు నమోదైన విషయం విధితమే. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్నాడని పోలీసులు ప్రకటించగా ఈరోజు రాత్రి న్యాయవాదుల సమక్షంలో బండి భగీరథ పోలీసులకు లొంగిపోయారు. రెండు గంటలపాటు సిట్ ఆధికారులు విచారించిన అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. రిమాండ్ రిపోర్ట్ పరిశీలించిన న్యాయమూర్తి 14 రోజుల పాటు ఈనెల 29 వరకు రిమాండ్ విధించారు.